telugu navyamedia
సినిమా వార్తలు

నాని “గ్యాంగ్ లీడర్” వాయిదా ?

Gang-Leader

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం “నాని’స్ గ్యాంగ్ లీడర్”. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు చిత్రబృందం. “బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను…” అంటూ ఐదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని నాని విడుదల చేశారు. పోస్టర్‌లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నానితో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్‌తో ఈ “గ్యాంగ్ లీడర్” గ్యాంగ్ లో ఉన్నదెవరో చెప్పేశారు. కథానుగుణంగా ఉన్న “నాని’స్ గ్యాంగ్ లీడర్” ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “ఆర్ఎక్స్ 100” ఫేమ్ కార్తికేయ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌‌తో డిఫరెంట్ లుక్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదల కానుంది. ఆ మేర‌కు అప్పుడే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభించింది. అయితే అనుకోకుండా “గ్యాంగ్‌ లీడ‌ర్‌”కు సమస్య ఎదురైంది. ఆగ‌స్టు 15న రావాల్సిన భారీ బడ్జెట్ చిత్రం “సాహో” 30కి వాయిదా ప‌డిందని వార్త‌లు వ‌స్తున్నాయి. గ్రాఫిక్స్ ప‌నులు ఇంకా పూర్తి కాక‌పోవ‌డం వ‌ల్ల “సాహో” రెండు వారాలు ఆల‌స్యంగా 30న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే “గ్యాంగ్‌ లీడ‌ర్‌”కు క‌ష్ట‌మే. “సాహ”`లాంటి భారీ సినిమాతో పోటీ ప‌డి మంచి ఓపెనింగ్స్ సాధించ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఈ నేప‌థ్యంలో “గ్యాంగ్‌ లీడ‌ర్‌” కూడా వాయిదా ప‌డుతుందని ఫిలిం నగర్ టాక్.

Related posts