telugu navyamedia
news telugu cinema news

ఎన్టీఆర్ నేటి తరాలకు డిక్షనరీ….

Nandamuri ramakrishna

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది ? సినీరంగంలో రారాజుగా ఎదిగిన అయన.. అటు రాజకీయ రంగంలో కూడా సత్తా చాటారు.

నేడు యన్.టి.రామారావు 25 వర్థంతిని పురష్కరించుకుని అయన తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ .. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి, తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహా వ్యక్తి నందమూరి తారకరామా రావు గారు. సినిమా రంగంలో నటుడిగా ఎవరు చేయలేనన్నీ రకాల పాత్రలు పోషించి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపారు. అయన పోషించిన పాత్రలు చరితాత్మకం. అయన నేటి తరాలకు డిక్షనరీ గాను, ఎన్సైక్లోపీడియాగా చిరస్థాయిగా నిలిచిపోయారు మా నాన్నగారు ఎన్టీఆర్ గారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా దేవుడి పాత్రల్లో కనిపించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. సినిమాల్లో ఉంటూనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిసి, నేను తెలుగు బిడ్డను అని తెలుగు దేశం అనే పార్టీని స్థాపించి.. కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన మహా వ్యక్తి అయన. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ..ప్రాంతాలు వేరైన, కుల, మతాలకు అతీతంగా అందరిని సమభావంతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అయన ముందుకు కదిలారు.

ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏంతో సేవా చేసారు. తెలుగోడి దమ్ము, దైర్యం, సాహసం .. అయన ప్రత్యర్థులను గడగడలాడించిన దైర్యం ఉన్న నాయకుడు మా నాన్నగారు నందమూరి తారకరామారావు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో పాటుపడిన వ్యక్తి అయన. తెలుగు బాషా, తెలుగు ఆత్మగౌరవాన్ని భారతీయ శిఖరాలపై రెపరెపలాడించిన గొప్ప వ్యక్తి, గొప్ప నాయకులూ మా నాన్నగారు తారక రామారావు. తెలుగు జాతి ఉన్నంతకాలం అయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, వారు బౌతికంగా మన మధ్య లేకపోయినా అయన ఎప్పటికి మనతోనే ఉంటారని, మా నాన్నగారి అభిమానులకు, మా కుటుంబ సబ్యులకు,మా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు దేశం అభిమానులకు అందరికి నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ..

జై తెలుగు తల్లి!! ..జై తెలుగు దేశం !! .. జోహార్ ఎన్టీఆర్ !!

Related posts

ఒకే ఒక్కడే….

Vasishta Reddy

ప్రభాస్ నా క్యాస్ట్… అందుకే ఈ బ్రహ్మముహూర్తం : వర్మ

vimala p

టీటీడీ ఫోర్న్ వీడియోలపై సోము వీర్రాజు సీరియస్‌…

Vasishta Reddy