telugu navyamedia
సినిమా వార్తలు

నాగ చైతన్యతో “ఆర్ఎక్స్ 100” దర్శకుడు… టైటిల్ ఇదే ?

Samantha-and-Naga-Chaitanya

ఈ వేసవిలో “మజిలీ” సినిమాతో ప్రేక్షుకుల మనసు దోచేసింది సమంత, నాగచైతన్య జంట. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టి పడేశారు చైసామ్. తమ పెళ్లి తర్వాత మొదటిసారి తెర పంచుకొని, నిజ జీవితంలోనే కాదు వెండితెరపై కూడా సూపర్ హిట్ జోడీ అనిపించుకున్నారు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమాతో భారీ హిట్ దక్కింది. “మజిలీ” విజయం చైతూ కెరీర్ గ్రాఫ్ లో కీలక మలుపు అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తర్వాత నాగచైతన్య కొత్త సినిమా ఏ దర్శకుడితో చేయబోతున్నాడనే విషయంపై పలు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా “ఆర్ఎక్స్100” సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కాగా ఈ సినిమాకు “మహాసముద్రం” ఆసక్తికర టైటిల్ కూడా ఫిక్స్ చేశారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని సమాచారం. పైగా ఇందులో సమంత కూడా నటించనుందని అంటున్నారు. దీనిపై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు కానీ చైతూ సమంత జంట మరోసారి తెరపై కనువిందు చేయనుందనే వార్తలు వస్తున్నాయి.

Related posts