telugu navyamedia
సినిమా వార్తలు

రాజ్ దూత్ : “మనసున మనసున…” లిరికల్ వీడియో

Rajdooth

రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి మేఘాంశ్ హీరోగా “రాజ్‌దూత్” అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీని, కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘాంశ్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక క‌థానాయిక‌గా నక్షత్ర కనిపించనుంది. మాస్ టచ్ తో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించిన లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు చిత్రబృందం. “మనసున మనసున ఏదో ఆశ… ” అంటూ ఈ పాట సాగుతోంది. వరుణ్ సునీల్ సంగీతం, కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం, సిద్ధార్థ్ మీనన్ ఆలాపనతో ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మేఘాంశ్ కు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. మరి మొదటి చిత్రంతో మేఘాంశ్ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే.

Related posts