telugu navyamedia
culture Telugu Poetry

మనసైన…

prema khaidi poetry corner

చీకటి తెరలు వెలుగును
కప్పేస్తున్న వేళ…

అతడు దూరంగా  పచ్చిక తివాచీలపై
ఆమె ఒడిలో అలసిన మేనితో..

అటు వీచిన పిల్లగాలిని
వేడుకొంది గలగల చప్పుడుచేయొద్దని..

ఇంటిముఖం పట్టిన గొర్రెల మందను
ఇటు తేవద్దని వేలికొనలతో సైగ చేసింది..

సంతోషం తో గళమెత్తిన చకోరాన్ని
దూరపు సీమలో తన పాటను పాడమన్నది..

మెరుస్తున్న తారకలను ఆకుల
మాటున దాగమన్నది…

ఉరిమే మేఘ మాలికను కొంతతడువు
తన పరుగులు ఆపమన్నది…

వెదురు పాడే మురళీ గానంపై
పెదవుల తడి అద్ది  మాయ చేసింది…

ఉదయపు తొలికిరణం
గడ్డిపై మెరిసేదాక  చిత్తరువై కూచుంది…

తనమనసైన మనిషి కోసం……

శ్రీమతి అవధానం అమృత వల్లి.

ప్రొద్దుటూరు

Related posts

‘ఫణి’ తుపాన్‌ బీభత్సం.. శ్రీకాకుళం జిల్లాలో 38 కోట్ల నష్టం!

vimala p

పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు.. కొన్ని రైళ్ల దారి మళ్లింపు

vimala p

శ్రీశ్రీ మాటలు మానవాళికి దిక్సూచి: చంద్రబాబు

vimala p