telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కుక్కను వెతికి పెట్టండి… ఇల్లు బహుమానంగా పొందండి

Arizona

అరిజోనాలోని ఓ వ్యక్తి తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు శునకం తప్పిపోవడంతో ఆవేదన చెందుతున్నాడు. దాంతో తప్పిపోయిన తన పెంపుడు శునకాన్ని వెతికిపెట్టిన వారికి సింగిల్ బెడ్ రూం ఇల్లు బహుమానంగా ఇస్తానని తెలిపాడు. టుస్కాన్‌లో నివాసముండే ఎడ్డీ కొలిన్స్ అనే వ్యక్తి ఎంతో ప్రేమగా పెంచుకున్న రెండేళ్ల జెన్నీ అనే కుక్క పిల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐనా రోడ్డులోని సర్కిల్ కే వద్ద తప్పిపోయింది. అప్పటి నుంచి జెన్నీ జాడ కోసం కొలిన్స్ వెతకని చోటు అంటూ లేదు. ఎంత వెతికిన కుక్క పిల్ల మాత్రం దొరకలేదు. దాంతో జెన్నీని వెతికి పెట్టిన వారికి నగదు బహుమతి ఇస్తానని కూడా ప్రకటించాడు. ఇలా చాలా రకాలుగా ప్రయత్నించి ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు తనకు బెన్సన్‌లో ఉన్న ఓ సింగిల్ బెడ్ రూం ఇల్లు బహుమానంగా ఇస్తానని, తన కుక్క పిల్ల ఎక్కడ ఉన్న తెచ్చివ్వాలని కొలిన్స్ కోరుతున్నాడు. ఈ లాభదాయకమైన ఆఫర్ అయినా జెన్నీని తన వద్దకు చేరుస్తుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నాడు. జెన్నీ కేవలం కుక్క పిల్ల మాత్రమే కాదని, అది నా కుటుంబంలో భాగమని అతడు చెప్పుకొచ్చాడు. శుక్రవారం రోజున ఈ ప్రత్యేక బహుమతిని ప్రకటించిన కొలిన్స్ ఇప్పటికీ జెన్నీ జాడ దొరకలేదని వాపోతున్నాడు.

Related posts