దివంగత ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్… మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ను “లక్ష్మీస్ ఎన్టీఆర్”గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలతో “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను తెరకెక్కిస్తున్నాడు వర్మ. కళ్యాణ్ మాలిక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేసి సంచలనం సృష్టించారు వర్మ.
నేడు ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు వర్మ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. “ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు “లక్ష్మీస్ ఎన్టీఆర్” ప్రాణం పోసుకోబోతోంది” అని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రకటన దేని గురించి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం ప్రీ లుక్ ను విడుదల చేస్తారా? లేదా ట్రైలర్ గానీ, టీజర్ గానీ విడుదల చేస్తారా ? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Lakshmi’s NTR will come alive on the death anniversary of NTR.. jan 18 th 5 PM pic.twitter.com/8oLZ62UVIW
— Ram Gopal Varma (@RGVzoomin) January 17, 2019