telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘వరుడు కావలెను’ నుండి విడుదలైన పాట ప్రోమో…

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ హీరో నాగ శౌర్య, హీరోయిన్ ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే టైటిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ‘వరుడు కావలెను‘ అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్న నమ్మకాన్నివ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.. ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్ కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ‘కోల కళ్ళే ఇలా’ అనే మెలోడీ సాంగ్ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమో వీడియో ఆకట్టుకోగా.. నాగశౌర్య, రీతు వర్మ జంట ఎంతో అందంగా కనిపించారు. పూర్తి లిరికల్ వీడియోని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Related posts