భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. వాహక నౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ప్రయాణించింది. మూడోదశలోనూ సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు.
నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ వాహక నౌకను గురువారం ఉదయం 5.43 గంటలకు ప్రయోగించారు. దీని ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టాలని చూశారు. ఇది భూ పరిశీలన ఉపగ్రహం. సరిహద్దుల పర్యవేక్షణ, ప్రకృతి వైఫల్యాలను అంచనా వేయడమే దీని లక్ష్యం.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 వాహన నౌక ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 26 గంటలపాటు కొనసాగింది. కౌంట్‌డౌన్‌లో భాగంగా రాకెట్‌లోని వివిధ దశల్లో ఇంధనం నింపారు. అనంతరం గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయితే క్రయోజనిక్ దశలో రాకెట్‌లో సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది.
అక్రమ సంపాదన కోసం కేసీఆర్ అడ్డదారులు: బండి సంజయ్