telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైద్యురాలి హత్యపై .. కేసీఆర్ స్పందన.. దోషులకు కఠిన శిక్ష…

bjp and congress fire on kcr on railway project

తెలంగాణ సీఎం కేసీఆర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై స్పందించారు. ఈ ఉదంతంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమైన.. అమానుషమైన దుర్ఘటన అన్నారు. ఇక నుంచి రాత్రి సమయంలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని.. మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమ మొబైల్‌ ఫోన్‌లో డయల్ 100 నెంబర్ తప్పక ఉండాలని సూచించారు. దిషాపై జరిగిన ఘాతుకాన్ని.. ఆర్టీసీ సమావేశంలో ప్రస్తావించారు సీఎం కేసీఆర్. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిస్టిస్ ఫర్ దిషాగా.. వైద్యురాలి కేసును సీపీ సజ్జనార్ మార్చారు. ఇకపై ఆమె పేరు బయట పెట్టకూడదని.. ఇదొక క్యాంపెయినింగ్‌గా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts