telugu navyamedia
సినిమా వార్తలు

ఆధారాలతో సహా కౌశల్ మీడియా సమావేశం

kaushal

బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ ఆయన పేరు మీదున్న ఆర్మీ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. “కౌశల్ ఆర్మీ” కౌశల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మాటన్నా, గొడవ పడినా… వాళ్లను ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోయేవారు కాదు. అలాంటి కౌశల్ ఆర్మీ ఇప్పుడు అకస్మాత్తుగా కౌశల్ ఆర్మీ స్వయంగా కౌశల్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ కు డబ్బు పిచ్చి ఉందని, డబ్బు లేకపోతే అభిమానులను కూడా పట్టించుకోడని, కౌశల్ ఎక్కడికి వెళ్లినా ఖర్చును మాత్రం కౌశల్ ఆర్మీనే భరించాల్సి వచ్చేదని, అభిమానులు తమ డబ్బులతోనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారని చెప్పారు ఇమామ్. అంతేకాదు బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును ఫౌండేషన్ కు వినియోగిస్తానని కౌశల్ చెప్పిన మాటలు అబద్ధమని, ఇలాంటి వ్యక్తి సొసైటీకి చాలా ప్రమాదకరమని మండిపడ్డారు.

ఈ ఆరోపణలపై స్పందించిన కౌశల్ ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చారు. తనపై వస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేశారు. బిగ్ బాస్ హౌస్ ఉంచి బయటకు వచ్చాక చాలామంది అభిమానులను కలిశానని, కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు తనను అభిమానించే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించారని, కౌశల్ ను కలవాలంటే తమకు న్యూడ్ ఫోటోలను పంపించాలని వేధించారని, అందుకే కౌశల్ వారిని మందలించినట్టు తెలిపారు. దీంతో వారు కౌశల్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని, నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా చానెళ్లు కూడా వారితో చర్చలు నిర్వహిస్తున్నారని, ఇదంతా తనీష్, బాబు గోగినేనిలు కావాలనే చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇంకా తను పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఆధారాలతో సహా చూపించారు.

Related posts