telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ తో కిచ్చ సుదీప్ భేటీ

Pawan

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ను కన్నడ స్టార్ హీరో సుదీప్ సోమవారం కలిశారు. ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి వచ్చిన సుదీప్ ఆయన్ని కలుసుకుని మొక్కలు బహూకరించారు. సుమారు గంటసేపు ఇద్దరూ ఏకంతంగా మాట్లాడుకున్నారు. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా షూటింగులు మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తాను నటిస్తున్న సినిమాల గురించి పవన్‌కు సుదీప్ తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. దీంతో పాటు వర్తమాన, సామాజిక అంశాలపై తమ ఆలోచనలను ఒకరికొకరు పంచుకున్నారు. కాగా ఇద్దరి పుట్టినరోజే సెప్టెంబర్ 2. పవన్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను సుదీప్ కన్నడలో రీమేక్ చేశారు. ‘రాణా’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సుదీప్‌కు మంచి విజయాన్ని ఇచ్చింది.

Related posts