telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజశేఖర్ ను ఫ్రాడ్ అన్న జీవిత… అందరూ షాక్…!?

Jeevitha Rajasekhar Complent Koushik

టాలీవుడ్ లో అన్యోన్యమైన జంటల జాబితాలో జీవితా రాజశేఖర్ జంట కూడా ఒకటి. రాజశేఖర్ వెంట ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరున్నా లేకున్నా జీవిత ఉంటుంది. అయితే ఇటీవల టీవలో ప్రసారమయ్య ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన జీవిత తమ దాంపత్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. జీవిత రాజేశేఖర్ మధ్య పరిచయం తమిళ సినిమా సమంయలోనే జరిగింది. అయితే వీరిద్దరి మధ్య “తలంబ్రాలు” చిత్రం సమయంలో పరిచయం కాస్త ప్రేమగా మారింది. తలంబ్రాలు సినిమాలో రాజశేఖర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారు. అందులో ఆయనది ఒక విధంగా ఫ్రాడ్ రోల్. దీంతో అప్పటి నుంచి ఆయన్ను జీవితా అలా పిలిచేవారట. “మగాడు” చిత్రీకరణలో ప్రమాదం జరగడంతో రాజశేఖర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఊళ్లో లేరు. సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చారు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న జీవితా… తల్లిదండ్రులు వచ్చాక వారి ముందు కూడా రాజశేఖర్‌ను “ఫ్రాడ్‌.. ఫ్రాడ్‌” అని పిలిచారట. దీంతో ఆరోజు సాయంత్రం రాజశేఖర్ తల్లి జీవితను పిలిచి “అంతా బాగానే ఉంది. ఫ్రాడ్‌ ఏంటీ. సరిగ్గా పిలువు. నాకు నచ్చలేదు” అని అన్నారట. దీంతో ఇక అప్పటి నుంచి రాజశేఖర్‌ను ఫ్రాడ్ అనడం మానేసి ‘బంగారం’ అని పిలవడం మొదలు పెట్టారట జీవిత. కాగా రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు టాలీవుడ్ లో హీరోయిన్లుగా స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చిన్నకూతురు శివాత్మిక “దొరసాని”తో ఎంట్రీ ఇచ్చేసింది.

Related posts