telugu navyamedia
news telugu cinema news

రాజమౌళి సినిమాకు అడ్డంకిగా మారిన ఆ సినిమా…?

rajamouli

డానియల్ క్రీగ్ అంటూ జేమ్స్ బాండ్ కు ప్రపంచమంతా అబిమానులు కోకళ్లుగా ఉన్నారు. అయితే అతడి నూతన చిత్రం, జేమ్స్ బాండ్ సిరీస్‌లో అతడు చేయనున్న చివరి చిత్రం నో టైమ్ టు డై. ఈ సినిమాను గతేడాది నవంబర్ 20న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మహమ్మారి కరోనా కారణంగా ఇది వెనక్కు వెళ్లింది. ఆ తరువాత థియేటర్లు తెరుచుకున్న వాటిపై ప్రేక్షకులు అంతగా మొగ్గుచూపక పోవడంతో జేమ్స్ నిర్మాతలు విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో ఈ జేమ్స్ బాండ్ సినిమా తెలుగు దర్శకధీరుడు రాజమౌళి సినిమాకు అడ్డంకిగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జక్కన్న కూడా తాను చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్‌ను అక్టోబరు 8కి రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈ సమయంలో జేమ్స్ బాండ్ సినిమా విడుదల ఉండటంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల మళ్లీ సందేహాల్లోకి వెళ్లింది. అయితే జేమ్స్ బాండ్ సిరీస్‌తో పోటీ పడటం మార్కెట్ పరంగా చాలా దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో జక్కన్న ఏం చేస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేస్తాడా అని కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts

వైసీపీ నేతలు విశాఖ వాసులను అవమానిస్తున్నారు: యనమల

vimala p

విమానంలో మహిళ రచ్చరచ్చ… ఇప్పుడు ఆత్మహత్య

vimala p

పెళ్లి సందడిలో హీరోయిన్ ఎవరంటే…?

Vasishta Reddy