telugu navyamedia
telugu cinema news trending

మహారాష్ట్ర నాటకీయ పరిణామాలపై ప్రముఖ నటుడి రియాక్షన్

Javed

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల్లాళ్ల తరువాత భారతీయ జనతాపార్టీ ఈరోజు ఉదయం ఎన్సీపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ మరోమారు మాహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే అజిత్ పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. దీనిపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. దీనిపై బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ తన రియాక్షన్‌ను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ‘ఎన్నికల తరువాత నేను నా ఓటును మార్చుకోవాలని అనుకుంటున్నాను. నేను అలా చేయలేనా? అది సాధ్యం కాని పక్షంలో ఎన్నికల తరువాత రాజకీయ నేతలు వారి పార్టీలను ఎలా మారుతారు? అని ప్రశ్నించారు. దీనికి క్యాప్షన్‌గా ‘ఇలాంటి ప్రశ్నకు ఎటువంటి సమాధానం ఉండదని’ పేర్కొన్నారు. కాగా ఈ ట్వీట్ చూసిన జావేద్ అభిమానులు తమ ప్రతిస్పందన తెలియజేస్తున్నారు.

Related posts

14 రోజుల్లో రూ.21.6 కోట్ల గ్రాస్ రాబట్టిన “అర్జున్ సురవరం”

vimala p

తెలంగాణ కరోనా అప్డేట్‌..భారీగా పెరిగిన కేసులు

Vasishta Reddy

కీర్తి సురేష్ తాజా లుక్ పై వర్మ కామెంట్స్

vimala p