telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆటో నడిపిన శ్రీదేవి కూతురు..

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జాన్వీ నటించిన “గుంజన్‌సక్సేనా : ది కార్గిల్ గర్ల్” చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది.  అయితే, అప్పుడప్పుడూ సినిమా సెట్స్ మీద నుంచీ ఫోటోలు, వీడియోస్ షేర్ చేస్తూ తన సొషల్ మీడియా పాలోయర్స్ తో టచ్ లో మాత్రం ఉంటోంది…సిద్ధార్థ్ సేన్ గుప్త దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గుడ్ లక్ జెర్రీ’ కంటే ముందే జాన్వీ నటించిన మరో సినిమా జనం ముందుకు రానుంది. ‘రూహీ అఫ్ జానా’ ఇప్పటికే చీత్రకరణ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అలాగే, ‘దోస్తానా 2’ సినిమాతో కూడా మన జాను కుర్రాళ్లని అలరించనుంది. అయితే, వరుస సినిమాలతో బిజీగా ఉన్న అతి లోకసుందరి కూతురు… తాజాగా ఓ ఆటో డ్రైవింగ్ వీడియో పోస్ట్ చేసింది. ‘ఈ రిక్షా’ నడుపుతూ జాన్వీ సెట్స్ మీద హల్ చల్ చేసింది. ఆమె కాన్ఫిడెంట్ గానే నడుపుతున్నప్పటికీ వెనుక కూర్చున్న వాళ్లు ‘బాబోయ్’ అంటూ కేకలు పెట్టటం వినిపించింది. ఈ సరదా వీడియోకి నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతూ రిప్లైస్ ఇస్తున్నారు!

Related posts