telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మళ్ళీ జగన్ కేసు .. విచారణ .. కొనసాగించవచ్చన్న హైకోర్టు.. !

Telangana Inter results petition High court

హైకోర్టు, వైసీపీ అధినేత జగన్‌పై ఈడీ దాఖలు చేసిన కేసు విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిందితుల్లో ఒకరిద్దరిపై కేసు కొట్టివేసినా మిగిలిన వారిపై విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు బి.పి.ఆచార్య, ఆదిత్యనాథ్‌దాస్‌పై ఈడీ నమోదు చేసిన ఓ కేసును హైకోర్టు జనవరి 21న కొట్టివేసిన విషయం తెలిసిందే.

తాజాగా, సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి మధుసూదనరావు ఈ కేసులో ఇతర నిందితుల మాటేమిటని సందేహం వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ లేఖ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు రాగా, ఇతర నిందితులపై కేసు కొనసాగించవచ్చునని ఆయన స్పష్టం చేశారు.

జగన్ కూడా నిన్నటి ప్రచారంలో భాగంగా తనను మళ్ళీ అరెస్ట్ చేయవచ్చని, కార్యకర్తలే పార్టీ కోసం కృషి చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చిన విషయం బహుశా ఇందుకేనని తెలుస్తుంది. కోర్టు ఆదేశాలతో జగన్ పై మళ్ళీ అరెస్ట్ వంటి చర్యలు చోటు చేసుకోవచ్చు. అయితే ఇది కేంద్రం ఆడిస్తున్నదా .. లేక మరో రాజకీయ చదరంగమా .. ఏమో; ఏదిఏమైనా ఈ చదరంగం ప్రజలు అర్ధం చేసుకుంటే.. దేశం బాగుపడ్డట్టే..!

Related posts