telugu navyamedia
రాజకీయ

రైతుబంధు తరహాలో కేంద్ర బడ్జెట్

huge recruitment notification in indian railways
తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం తరహాలోనే కేంద్రం కూడ రైతుల ప్రయోజనం కోసం  బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.2019-20 సంవత్సరానికి గాను తాత్కాలిక బడ్జెట్‌ను ఇన్‌చార్జ్ ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.  ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాలో ఉండటంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ ఆర్థిక మంత్రిగా పీయూష్‌ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. చిన్న కారు రైతుల ప్రయోజనం కోసం  బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఐదెకరాలు ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేలను చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము చేరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ప్రకటించారు.12 కోట్ల మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని  గోయల్ తెలిపారు.ఈ పథకం 2018 డిసెంబరు నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతు కుటుంబాలు ఈ పథకం వల్ల సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమన్నారు.

Related posts