telugu navyamedia
ఆరోగ్యం

సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

summer

సమ్మర్‌లో అన్నింటికన్నా ముఖ్యం హైడ్రేట్‌గా ఉండటం. బయటకు వెళ్లేప్పుడు నీళ్ల బాటిల్‌ వెంట తీసుకుని వెళ్లాలి. ఉదయం 9 కల్లా ఆఫీస్‌కు వెళ్లడం, సాయంత్రం 5 తర్వాతే బయటకు రావడం చేయాలి. ఈ విధంగా చేస్తే వడదెబ్బ బారిన పడరు. ఏసీ గదుల్లోంచి వెంటవెంటనే మారకూడదు. ఏసీ గది నుంచి ముందుగా సాధారణ ఉష్ణోగ్రత ఉన్న గదిలోకి వచ్చి, తర్వాత ఎండలోకి వెళ్లొచ్చు. దీనినే ‘క్లయిమటైజేషన్‌’ అంటారు. హఠాత్తుగా ఉష్ణోగ్రతల మార్పు వల్ల రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. అయితే అది మన కంటికి కనిపించదు. కానీ శరీరానికి నష్టం జరుగుతుంది. అదే విధంగా బయటి నుంచి రాగానే వెంటనే చల్లటి నీళ్లు తాగొద్దు. 5 నిమిషాలు ఆగిన తర్వాత తాగాలి. ఎండలకు నిమ్మరసం కలిపిన మజ్జిగ దివ్యౌషధంలా పనిచేస్తుంది. మజ్జిగలో ఉన్న కాల్షియం, ఉప్పులో ఉండే సోడియం, నిమ్మరసంలోని పొటాషియం వడదెబ్బ నుంచి రక్షించడమేగాక, శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి. వేసవిలో పండ్లరసాలు, సూప్స్‌ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు.

Related posts