telugu navyamedia
ఆరోగ్యం

చ‌లి కాలంలో పొడి చ‌ర్మంతో బాధ‌ప‌డుతున్నారా?

శీతాకాలం వ‌చ్చిందంటే చాలు చ‌ర్మం పొడిబార‌కుండా మార్కెట్‌లో వ‌చ్చే క్రీములు అన్నీ వాడుతుంటాం. మ‌న ఈ కాలం చ‌ర్మాన్ని మ‌రింత జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. చల్లని గాలులు ప్రభావం ముందుగా మన చర్మంపై కనిపిస్తుంది. చ‌ల్ల‌ని పొడి గాలిలో తేమ త‌గ్గ‌డం వ‌ల‌న.. చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం, మడమలు పగిలిపోవడం తదితర సమస్యలు ఏర్ప‌డ‌తాయి.

ఈ శీతాకాంలో చ‌ర్మంపై స‌ హాజ తేమ ఎక్కువ‌గా నిల‌వ‌దు. దీంతో చ‌ర్మం త్వ‌ర‌గా పొడిబారిపోతుంది. పొడి చర్మం వల్ల చర్మంలో దురద, మంట, కొన్ని సందర్బాలు వాపుకు కూడా కారణం అవుతుంది.

దీన్నిఅధిగమించడానికి సహజ మార్గాల ఎంపిక చేసుకోవడం ఎల్లప్పుడూ అవసరం మరియు ఉత్తమమని బ్యూటీ నిపుణులు అంటారు. కొన్ని ఇంటి చిట్కాలతో చర్మం పొడిబారకుండా ఏలా అనేది ఇప్ప‌డు తెలుసుకొందాం..

9 Benefits of Honey Water You Never Knew

తేనే..నిమ్మ‌ర‌సం ప్యాక్‌..

పొడి చర్మంతో బాధ ప‌డేవారు తేనెను ఉపయోగించవచ్చు. తేనెను ఉపయోగించడం ద్వారా అన్ని చర్మపు చికాకులు తొలగిపోతాయి. పొడి చర్మం నుండి ఉపశమనం కలిగించడానికి తేనె మరియు కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాయండి. ఇది చర్మ అలెర్జీని తొలగించడానికి సహాయపడుతుంది మరియు పొడి చర్మం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పొడి చర్మం మరియు అలెర్జీలు త్వరగా నయమవుతాయి.

Orange Peel Powder - 100 Grams: Buy Online at Best Prices in Pakistan | Daraz.pk

 

నారింజ తొక్కలు పౌడ‌ర్ ప్యాక్‌

నారింజలో విటమిన్ సి లభిస్తుంది. ఇది మీ చర్మాన్ని పునరుద్ధరించడానికి పనిచేస్తుంది. కానీ మీరు నారింజ తిన్న తర్వాత దాని తొక్కలను ఉపయోగించవచ్చు. తొక్కలు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీని తర్వాత అవసరాన్ని బట్టి ఈ పొడిలో తేనె మిక్స్ చేసి పేస్ట్‌ రెడీ చేసుకోవాలి.. ఆ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. దాదాపు అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

చర్మం కాంతివంతం చేసే 21 శెనగపిండి ఫేస్ ప్యాక్

పసుపు, శెనగపిండి

పూర్వా కాలం పసుపు, శెనగపిండి స‌బ్బులా ఉప‌యోగించుకునే వాళ్లు. ఈ పద్ధతి ఈ నాటికి అంద‌రూ చేస్తున్నారు. ఒక టీస్పూన్ పసుపు పొడిలో రెండు టీస్పూన్ల శెనగపిండిని కలపాలి. ఒక చెంచా క్రీమ్ వేసి కొద్దిగా పాలు కలపండి. దీని తరువాత, అన్ని వస్తువులను బాగా కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. దీన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం పొడిబారడం క్షణాల్లో మాయమవుతుంది. అలాగే నలుపు కూడా తొలగిపోతుంది.

Should You Drink Orange Juice? It Depends On Your Goals - ABC News

ఆరెంజ్ జ్యూస్‌..

శీతాకాలంలో దాహం తక్కువగా ఉండ‌డం వ‌ల్ల చాలా నీరు తీసుకోవడం త‌గ్గిస్తారు. అటువంటి పరిస్థితిలో చ‌ర్మం పొడిబారిపోతుంది. ఆరెంజ్ జ్యూస్ తాగ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు కానీ నారింజ తినడానికి ఇష్టపడతారు. అయితే నారింజ రసం తీసుకొని మీ ముఖం మీద రాయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ప్రతిరోజూ నిద్రించడానికి ముందు మీ ముఖానికి ఆరెంజ్ జ్యూస్ ను రాయండి. నారింజ ద్వారా అందానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

8 Amazing Ways To Use Curd (Dahi) For Face & Skin - The Channel 46

పొడి చ‌ర్మానికి పెరుగు..

పెరుగు అందం సంరక్షణలో సహాయపడే ఉత్తమ మార్గాలలో పెరుగు ఒకటి అనడంలో సందేహం లేదు. చర్మ రంగు పెంచడానికి పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ముఖానికి పెరుగు రాయడం వల్ల చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. పొడి చర్మం కోసం పెరుగు ఉత్తమ సహజ నివారణలలో ఒకటి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత శుభ్రం చేసుకోండి. పొడి చర్మం వదిలించుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.

olive oil for skin - Online Discount Shop for Electronics, Apparel, Toys, Books, Games, Computers, Shoes, Jewelry, Watches, Baby Products, Sports & Outdoors, Office Products, Bed & Bath, Furniture, Tools, Hardware, Automotive

ఆలివ్ ఆయిల్ తో అందం..

ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో అందానికి సంబంధించిన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మ రంగు పెంచగడానికి ఇది గొప్పగా సహాయం చేస్తుంది. ఆలివ్ ఆయిల్ దాని శీఘ్ర మరియు ప్రభావవంతమైన చర్మ సంరక్షణ పరిష్కారాలకు ప్రసిద్ది చెందింది. ఇది ముఖం మీద రాయవచ్చు మరియు పది నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో కడిగివేయవచ్చు.

Related posts