telugu navyamedia
సినిమా వార్తలు

అదరగొడుతున్న “హిప్పీ” టీజర్

Hippi

కార్తికేయ హీరోగా నటించిన “ఆర్ఎక్స్ 100” సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కార్తికేయ ఇమేజ్ పెరిగిపోయింది. కార్తికేయకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండగా, ఆయన తరువాత సినిమా గురించి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కార్తికేయ “హిప్పీ” అనే ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. ‘‘ఒక అమ్మయిని పక్కన పెట్టుకొని ఇంకో దాన్ని పట్టుకున్నారు.. అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు తెలుసా…’’ అనే డైలాగ్‌తో ప్రారంభమై ‘‘నువ్వు నన్ను ప్లే బాయ్‌లా చూస్తున్నావ్.. నేను లవర్ బాయ్‌ని’’ అని హీరో కార్తికేయ చెబుతున్న డైలాగ్‌తో పూర్తయింది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

కలైపులి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. “దిగంగాన” ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రంతో తన ఖాతాలో మరో హిట్టు గ్యారంటీ అనే ధీమాతో ఉన్నారు కార్తికేయ. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts