telugu navyamedia
news telugu cinema news

ఆ హీరోల ఫ్యాన్స్‌ మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన పూజా…

Pooja

పూజా హెగ్డే ఇంటర్వ్యూ అంటే ఏదో ఒక కాంట్రవర్సీ వుండాల్సిందేనా? ఆమధ్య టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ.. రీసెంట్‌గా ఓ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అమ్మడి మాటలు కొందరికి నచ్చడం లేదు. ఈసారి ఈ అమ్మడిమాటలు బన్నీ.. ఎన్టీఆర్.. మహేశ్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చు పెట్టేలా వున్నాయి. ఇంతకీ బుట్టబొమ్మ ఏమంది? ఫ్యాన్స్‌ ఏమని అర్థం చేసుకున్నారు?… కంటిన్యూ హిట్స్‌తో పూజా హెగ్డే టాప్‌ ప్లేస్ సొంతం చేసుకుంది. రెమ్యునరేషన్‌పరంగా 2 కోట్లు దాటిపోయింది. తెలుగులో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ పూజానే. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు.. హై పొజిషన్‌లో వున్న పూజానే వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్‌ ఇండియా ఆడియన్స్ థైస్‌ ఎక్కువ లైక్ చేస్తారన్న మాటలతో వివాదం కొనితెచ్చుకుంది. ఛాన్సులిచ్చి ఆదరించి… స్టార్‌ హీరోయిన్ని చేసిన తెలుగు ఇండస్ట్రీపైనే వెటకారమా? అంటూ.. ట్రోల్‌కు గురైంది పూజా. దీనికి తెలుగు ఆడియన్స్‌కు ఎప్పటికీ రుణిపడి వుంటానని లెటర్‌ రాస్తేగానీ.. వ్యవహారం చల్లపడలేదు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో అరవింద సమేత వీర రాఘవ టాపిక్‌ వచ్చింది. తన కెరీర్‌కు ఎలా వుపయోగపడిందో చెప్పింది పూజా. అరవింద సమేత ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన చిత్రమని.. ఎన్టీఆర్‌తో కలిసి వర్క్‌ చేయడం అద్భుతమనిపించిందని చెప్పుకొచ్చింది. ఇద్దరి ఎనర్జీ లెవెల్స్‌ కొంచెం ఎక్కువని.. అందుకే.. ఆన్‌స్క్రీన్‌లో తమ జోడీ ప్రేక్షకులను అలరించిందని చెప్పింది పూజా. ఈ మాటలతొ తారక్ ఫ్యాన్స్‌ ఖుషీ అయినా.. మహేశ్‌ .. బన్నీ అభిమానులకు మాత్రం రుచించలేదు. ఎనర్జీకి.. స్టైలిష్‌కు తమ హీరోనే పెట్టింది పేరని.. బన్నీ ఫ్యాన్స్‌ భావిస్తారు. మా ఇద్దరి ఎనర్జీ లెవెల్స్‌ ఎక్కువని తారక్‌ గురించి పూజా అనడంతో.. బన్నీ ఏం తక్కువని ప్రశ్నిస్తున్నారు. అల వైకుంఠపురంలో బన్నీ, పూజా ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ అదరిందని.. అలాంటిది ఎన్టీఆర్‌ను మాత్రమే ప్రస్తావించడం బన్నీ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. తమ హీరో గురించి చెప్పకోవడం బన్నీ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. మరి వీళ్లని బుజ్జగించడానికి ట్విట్టర్‌ వేదికగా ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేస్తుందో.. లైట్‌ తీసుకుంటుందో చూడాలి.

Related posts

సొంత కిడ్స్ ఫ్యాషన్ లైన్ ను లాంచ్ చేయనున్న మంచు ట్విన్స్

vimala p

చర్చల్లో హామీ రాలేదు.. 5 నుంచి సమ్మెకు దిగుతాం: టీఎస్ఆర్టీసీ ఐకాస

vimala p

శాంసంగ్ … గెలాక్సీ ఎ80 .. అందుబాటు ధరలలోనే..

vimala p