telugu navyamedia
క్రైమ్ వార్తలు

కంపెనీ తొలగించిందని డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్య

suicide attempt cc
హెరిటేజ్‌ కంపెనీ తనను అకారణంగా తొలగించిదని మనస్తాపంలో ఓ డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కంపెనీ తనను  తొలగించడంతోనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన గంగినేని హరిబాబు(48)  హెరిటేజ్‌క కంపనీ లో  డిస్ట్రిబ్యూటర్‌గా చేరి,  రూ.2.8 లక్షలు కూడా డిపాజిట్‌ చేశాడు.
కంపెనీ తనకు సరఫరా చేస్తున్న పాలు ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగించేవాడు. అదనంగా డిపాజిట్‌ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాల పదార్థాల సరఫరా నిలిపివేస్తున్నట్టు హరిబాబుకు జనవరి 5న కంపెనీ నుంచి మెయిల్‌ అందింది. తనను ఆపేస్తే ఆర్థికంగా ఇబ్బందిపడతానని యాజమాన్యాన్ని లేఖ ద్వారా వేడుకొన్నారు.  ఆ ఉత్తరానికి కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Related posts