telugu navyamedia
సినిమా వార్తలు

“గాడ్జిల్లా-2 : కింగ్ అఫ్ ది మాన్స్టర్స్” తెలుగు ట్రైలర్

Godzilla

తాజాగా “గాడ్జిల్లా-2 : కింగ్ అఫ్ ది మాన్స్టర్స్” తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లోని భారీ యాక్షన్ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2014లో విడుదలైన “గాడ్జిల్లా” చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఇక “గాడ్జిల్లా” ఫ్రాంచైజ్ లో ఇది 35వ చిత్రంగా తెరకెక్కింది. ఈ అమెరికన్ మాన్స్టర్ చిత్రానికి మైఖేల్ డౌగ్హెర్టీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కైల్ చాండ్లెర్, వేరా ఫెర్మిగా, బ్రాడ్లీ విట్ఫోర్డ్, శాలి హాకిన్స్, మిల్లీ బాబీ బ్రౌన్, చార్లెస్ డాన్స్, థామస్ మిడిల్ డిచ్, ఐషా హిండ్స్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి బేర్ మెక్ క్రీరీ సంగీతం అందించారు. ఇక మే 31న ఈ భారీ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts