telugu navyamedia
క్రైమ్ వార్తలు సామాజిక

తెలిసే ప్రమాదాన్ని ఆహ్వానించాడు… తరువాత…??

Florida man killed by cassowary he kept on his farm

అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదమని తెలిసి కూడా ఆ భయంకరమైన పక్షిని పెంచుకుని, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… ఆస్ట్రేలియాలోని న్యూ గినియా దేశాల్లో క్యాసొవరీ పక్షులు ఎక్కువగా ఉంటాయి. ఫ్లోరిడాకు చెందిన మార్విన్ హాజొస్ అనే 75 ఏళ్ళ వ్యక్తి ఈ పక్షి ప్రమాదకరమైనదని తెలిసి కూడా ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకుని మరీ పెంచుకున్నాడు. శుక్రవారం ఉదయం మార్విన్‌ను ఇదే పక్షి చంపేసినట్టు పోలీసులు ద్వారా తెలిసింది. ఈ పక్షి కాళ్లు చాలా ప్రమాదకరమైనవని, చాలా బలంగా ఉంటాయని, వాటితో దాడి చేస్తే ప్రాణాలు పోవడమో లేదా ఆసుపత్రి పాలవ్వడమో ఖాయమని వాషింగ్టన్ జూ అధికారులు చెబుతున్నారు. తమ జూలో కూడా ఇలాంటి పక్షులు ఉన్నాయని, ఆ పక్షి దగ్గరకు వెళ్లాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని వారు తెలిపారు. ప్రమాదం అని తెలిసి ఇలాంటి పక్షులను ఎలా పెంచుకుంటున్నారో తమకు అర్థం కావడం లేదని జూ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ పక్షులు పండ్లను తిని బతుకుతుంటాయి. ఆస్ట్రేలియా అడవుల్లో ఈ పక్షులు ఎక్కువగా ఉంటాయని, అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి మనుషులను భయపెడుతుంటాయని చెబుతున్నారు అధికారులు.

Related posts