telugu navyamedia
telugu cinema news trending

జాకెట్ తెచ్చిన చిక్కులు… హీరోయిన్ పై కేసు నమోదు

Vani-Kapoor

బాలీవుడ్ బ్యూటీ వాణీ క‌పూర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌ర‌చిత‌మే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు త‌న ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోల‌ని రెగ్యుల‌ర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా హిందువుల ప్ర‌ధాన దేవుడు రాముడు పేరుతో ఉన్న బ్లౌజ్ ధ‌రించి ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్స్ ఆమెపై మండిప‌డ్డారు. రాముడు పేరుతో ఉన్న ఇలాంటి దుస్తులు ధ‌రించి హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తున్నావు అని ఆమెపై మండి ప‌డ్డారు. ఓ వ్య‌క్తి ఏకంగా ముంబై పోలీసుల‌కి కూడా ఫిర్యాదు చేశాడు. స‌ద‌రు వ్య‌క్తి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివాదం ముదురుతున్న క్ర‌మంలో వాణి క‌పూర్ త‌న ఫోటోని ప‌ర్స‌న‌ల్ అకౌంట్ నుండి తొల‌గించింది. కాని అప్ప‌టికే ఆ ఫోటోలో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగులో ఆహా క‌ళ్యాణం సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.

Related posts

నిఖిల్ “ముద్ర” కొత్త టైటిల్ ఇదే

vimala p

జనసేనలో టికెట్ కోసం.. దరఖాస్తు చేసుకున్న.. పసుపులేటి బాలరాజు..

vimala p

పరశురామ్ తో మహేష్ 27వ చిత్రం… ఇట్స్ అఫీషియల్

vimala p