telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 వరల్డ్ కప్ : … ఆతిద్యజట్టు ఘనవిజయం..

england grand won in 2019 world cup match

ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ 12వ మ్యాచ్‌ కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన ఇంగ్లండ్ 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో షకిబ్ అల్ హసన్ (119 బంతుల్లో 121 పరుగులు, 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ సాధించాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికుర్ రహీం (50 బంతుల్లో 44 పరుగులు, 2 ఫోర్లు) కూడా తన వంతు సహకారం అందించాడు. అయినప్పటికీ బంగ్లా జట్టు ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండడంతో ఆ జట్టు పరుగుల వేటలో వెనుకబడి ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు. ప్లంకెట్, రషీద్‌లకు చెరో వికెట్ దక్కింది.

టాస్ ఓడినా, ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. దీనితో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో జాసన్ రాయ్ (121 బంతుల్లో 153 పరుగులు, 14 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే జాస్ బట్లర్ (44 బంతుల్లో 64 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (50 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు)లు అర్ధ సెంచరీలు చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్‌లకు చెరో 2 వికెట్లు దక్కగా, కెప్టెన్ మష్రఫె మొర్తాజా, ముస్తాఫిజుర్ రహమాన్‌లకు చెరొక వికెట్ దక్కింది. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది.

Related posts