telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎల్లువొచ్చి గోదార‌మ్మ” వీడియో సాంగ్

Valmiki

వరుణ్ తేజ్‌, అథ‌ర్వ ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌. ప్ర‌స్తుతం బాక్సాఫీస్‌ని షేక్ చేసిన గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ‌కి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అథ‌ర్వ‌కి జంట‌గా మృణాలినీ రవి న‌టించింది. కెరీర్‌లో తొలిసారి పవర్ ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజ‌కు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలకు ప్రశంసలు దక్కాయి. శోభ‌న్ బాబు, శ్రీదేవి, జ‌య‌ప్ర‌ద ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం దేవ‌త‌. ఇందులో శ్రీదేవి, శోభ‌న్ బాబు మ‌ధ్య వచ్చే ఎల్లువచ్చి గోదారమ్మ అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందే ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఇందులో బిందెల మ‌ధ్య వీరిద్ద‌రు నృత్యం చేయ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇదే సాంగ్‌ని సేమ్ స్టైల్‌లో గద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రం కోసం రీమేక్ చేసారు హరీష్ శంక‌ర్. వ‌రుణ్ తేజ్‌, పూజా హెగ్డేల మ‌ధ్య “ఎల్లువొచ్చి గోదార‌మ్మ” రీమేక్ సాంగ్ చిత్రీక‌రించగా, ఈ సాంగ్‌కి థియేట‌ర్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. సీట్ల‌లో నుండి లేచి మ‌రీ ఆడియ‌న్స్ స్టెప్పులేసారు. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts