telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చనువిచ్చింది కదా అని ఏనుగుతో ఫోటో దిగాలనుకుంటే…!

Elephant

పెన్సిల్వేనియాకు చెందిన ఓ అమ్మాయి తన తోటి విద్యార్థులతో కలిసి ఆఫ్రికాలోని జాంబీయాలో ఓ జంతు ప్రదర్శనశాలకు వెళ్లింది. అక్కడ జూలో కనిపించిన ఓ ఏనుగు వద్దకు వెళ్లి ఫొటో దిగబోయింది. అంతే… అప్పుటి వరకు తన తొండంతో విద్యార్థులను హలో చెప్పిన ఆ ఏనుగు ఒక్కసారిగా ఫొటో తీస్తున్న అమ్మాయిపై విరుచుకుపడింది. తొండంతో విద్యార్థినిని చాచిపెట్టి కొట్టింది. ఆ తరువాత అమ్మాయి చేతిలోంచి కిందపడ్డ మొబైల్‌ను తొండంతో అందుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో విద్యార్థినికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతు ప్రదర్శనశాలల్లో ఇదివరకే తమ నిర్లక్ష్యంతో ప్రమాదాల బారిన పడిన ఘటనలు చాలానే జరిగాయి. కొంతమంది చావు దాకా వెళ్ళి వస్తే… మరికొంత మంది మరణించారు కూడా. అయినప్పటికీ ఇలాంటి ఘనాలు పునరావృతం కావడం మనుషుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

Related posts