telugu navyamedia
telugu cinema news trending

సినిమాలో నటించేసరికి .. నడుములు పడిపోయాయి.. : దిశా పటానీ

disapatani on barat movie song making

అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ ఖాన్ .. కత్రినా కైఫ్ .. దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా ‘భారత్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 5వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో సల్మాన్ .. దిశా కాంబినేషన్లో ఒక స్లోమోషన్ సాంగ్ వుంది. ఇటీవల వదిలిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

తాజాగా దిశా ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో తాను పడిన కష్టాలను గురించి స్పందిస్తూ .. “స్లో మోషన్ పాటలో మూమెంట్స్ కోసం జిమ్నాస్టిక్స్ ను కూడా కొన్నిరోజుల పాటు ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో నా మోకాలికి గాయం కావడమే కాకుండా నడుము పట్టేసింది. ఎటూ కదల్లేని పరిస్థితి .. వారం రోజుల పాటు బెడ్ కే పరిమితమైపోయాను. రాత్రివేళలో షూటింగ్ మొదలై, తెల్లవారుజామువరకూ ఈ పాట చిత్రీకరణ జరిగేది. ఇది నాకు ఇంకా ఇబ్బందిని కలిగించే విషయం, అయినా షూటింగ్ సమయంలో మోకాలి దగ్గర ఐస్ పెట్టుకుంటూ .. బాధతోనే ఆ పాటను పూర్తిచేశాను. ఇప్పుడు ఈ పాటకి లభిస్తున్న ఆదరణ నా కష్టాన్ని మరిచిపోయి .. ఆనందించేలా చేస్తోంది” అని చెప్పుకొచ్చింది.

Related posts

గర్భవతులు .. మేకప్ వేసుకోవచ్చా..?

vimala p

“సాహో” బ్యానర్ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి

vimala p

స్వతంత్రులకే జై కొట్టిన .. కర్ణాటక మంత్రివర్గ విస్తరణ..

vimala p