telugu navyamedia
సినిమా వార్తలు

స్పెషల్ సాంగ్ తో అదరగొడుతున్న పాయల్

payal special song in sita movie

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న `సీత‌` చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించారు. సినిమా క‌థానుసారం కీల‌క స‌మ‌యంలో వచ్చే “బుల్ రెడ్డి…” అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు చిత్రబృందం. ఈ స్పెష‌ల్ పెప్పీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పిస్తోంది. ఈ సాంగ్‌లో పాయ‌ల్ సోలో పెర్ఫామెన్స్, ఆమె డ్యాన్స్, అభినయం, గ్లామర్ హైలైట్‌గా నిలిచాయి. మీరు కూడా ఈ సాంగ్ పై ఓ లుక్కేయండి. 

సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ 2.5 మిలియ‌న్ వ్యూస్‌తో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్‌గా ట్రేడ్ వ‌ర్గాల్లో బిజినెస్ డీల్స్ కూడా పూర్త‌య్యాయి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

Related posts