telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరికొంత సమయం పడుతుంది… రూమర్స్ నమ్మొద్దు : డైరెక్టర్ మారుతీ

Maruthi

డైరెక్ట‌ర్ మారుతి గ‌త ఏడాది ‘ప్ర‌తిరోజూ పండగే’ చిత్రంతో స‌క్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు. ఈ నేప‌థ్యంలో మారుతి తరువాత సినిమా గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి త‌న చిన్నల్లుడు క‌ల్యాణ్‌దేవ్‌ను హీరోగా పెట్టి సినిమా చేయాల‌ని మారుతిని కోరాడ‌ట‌. అయితే చిరు ఆఫ‌ర్‌ను మారుతి సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ని చెబుతూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై డైరెక్ట‌ర్ మారుతి క్లారిటీ ఇచ్చారు. తన నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాన‌ని, స్క్రిప్ట్ పూర్త‌వ‌డానికి మ‌రికొన్ని రోజులు ప‌డుతుందని మారుతి తెలిపారు. సినిమాకు సంబంధించిన ప్ర‌ధాన‌మైన ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని అప్ప‌టి వ‌ర‌కు రూమ‌ర్స్‌ను న‌మ్మవ‌ద్దంటూ మారుతి క్లారిటీ ఇచ్చారు.

Related posts