telugu navyamedia
సినిమా వార్తలు

భారీ స్థాయిలో విడుదలైన “భారత్”

Bharat

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ “భారత్” చిత్రం అనేక వివాదాల న‌డుమ నేడు ఈద్ కానుక‌గా విడుద‌లైంది. భారీ సంఖ్య‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. రిలీజ్‌కి ముందు అనేక వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. భారత్ సినిమా టైటిల్ సెక్షన్-౩ ఉల్లంఘన (చిహ్నాలు, పేర్లు) కిందకు వస్తుంది. భారత్ పేరును వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపేయాలని పిల్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. 4000కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి ప్ర‌ముఖ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్‌లో ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. “ఈ చిత్రం ఒక ఎమోష‌న‌ల్ జర్నీ. ప్రేక్ష‌కుల హృద‌యాల‌ని గెలుచుకుంటుంది. సల్మాన్, కత్రీనాల అసాధారణ నటన, అలీ అబ్బాస్ కామెడీ, పలు ఎమెషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి” అని త‌రణ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. “భార‌త్” చిత్రం అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌గా, ఇందులో స‌ల్మాన్ స‌ర‌స‌న కత్రీనా, దిశా పటానీ, టబూ, జాకీ‌ష్రాఫ్, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఐదు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. భారత్ సినిమా తొలి రోజు రూ. 40 కోట్లు వసూళ్ళు రాబ‌ట్ట‌నుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related posts