telugu navyamedia
news telugu cinema news

ఉప్పెన తమిళ్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విజయ్…

ప్రస్తుతం ఈ నెలలో విడుదలై హిట్ అందుకున్న సినిమా ఉప్పెన. ఇందులో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించారు. తమ తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుందీ జంట. ఈ సినిమా బుచ్చిబాబు అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి అలరిచింది. ఈ సినిమాలోని ప్రతి అంశం కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాను తమిళంలోకి రీమేక్ చేయాలని చూస్తున్నారంట. తమిళ రీమేక్ హక్కులను ఓ స్టార్ హీరో కొనుగోలు చేశారు. అదేవరో కాదండీ ఉప్పెన సినిమా విలన్ పాత్రలో అందరినీ మెప్పించిన విజయ్ సేతుపతి. అవును.. విజయ్ సేతుపతి ఉప్పెన తమిళ్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో ప్రొడక్షన్ కంపెనీని సినిమాను తమిళ్‌లోకీ అనువాదం చేయొద్దని అడిగారంట, ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఉప్పెన సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా తమిళ హక్కులను విజయ్ దక్కించుకున్నారు. అతి త్వరలో ఈ సినిమాను తమిళంలో తెరకెక్కిస్తారంట. చూడాలి మరి ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts

హైదరాబాద్ : … పోలీసు కమిషనరేట్‌ భరోసా కేంద్రంలో … మహిళలకు ఉద్యోగాలు..

vimala p

ప్రపంచంలోనే అతిపెద్ద .. తాత్కాలిక నగరం… మనదేశంలోనే..

vimala p

వైఎస్ జగన్ అవినీతి రాజ్యానికి రాజు: ఎమ్మెల్సీ అశోక్ బాబు

vimala p