telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ర‌ణ్‌వీర్ కు దీపికా ఘాటు ముద్దు… వీడియో వైరల్

Deepika

బాలీవుడ్ రొమాంటిక్ క‌పుల్ దీపికా ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్ లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా సండే రోజు త‌న భ‌ర్త బుగ్గ‌పై ఇచ్చిన ఘాటు ముద్దుకి సంబంధించిన వీడియోని షేర్ చేసింది దీపికా ప‌దుకొణే. ఈ వీడియోకి “ప్రపంచంలోని అంద‌మైన ముఖం” అని కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేయ‌డ‌మే కాక నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ కార‌ణంగా ర‌ణ్‌వీర్, దీపికాలు గ‌త రెండు నెల‌లుగా ముంబైలోని త‌మ ఇంటికే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. దీపిక త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్ కోసం వంట‌కాలు నేర్చుకొని మ‌రీ స్వయంగా వండి పెడుతుంది. ఇందుకు సంబంధించిన‌ ఫోటోలు కూడా అప్పుడ‌ప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.

Related posts