telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అలా చేసింది చనిపోయిన నానమ్మే..!?

Dead-Granny

బ్రిటన్‌లోని లాంకషైర్ ప్రాంతానికి చెందిన కెర్రీ వాటర్‌వర్త్ అనే మహిళ తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకొంది. ఆమె కుమారుడు నిద్ర పోతున్న గదిలో కెమెరా పెట్టింది కెర్రీ. ఆ కెమెరా రికార్డు చేసిన ఓ వీడియోను షేర్ చేయగా… అందులో ఓ మూలగా చెయ్యి ఆకృతి ఏర్పడి… ఆ పిల్లాడి తల నిమిరింది. అది చూసిన ఆమె ముందుగా ఏదో సాలెపురుగు అనుకుందట. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అలాంటిదేమీ కనిపించలేదని కెర్రీ చెప్పింది. ఆ చెయ్యి కచ్చితంగా చనిపోయిన పిల్లాడి నాయనమ్మదేనని అంటోంది. ఆమెకు తన కొడుకంటే ఎంతో ప్రేమని, అందుకే ఆమె ఆత్మ అతన్ని వదిలి వెళ్లలేకపోతోందని చెబుతోంది కెర్రీ. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలామంది ఇది నిజంగా విచిత్రమైన అనుభవమే అంటున్నారు.

Related posts