telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

వెయ్యి కోట్లు గొంతులో పెట్టుకొని… గుటుక్కుమన్నాడు.. లబోదిబో అంటున్న డిపాజిటర్లు..

crypto currency gerald died with passward

రహస్యంగా ఉంచాల్సిన విషయాన్నీ దాదాపుగా ఒక్కరే తమ వద్ద దాచుకుంటారు. అది మరొకరికి చేరితే అంతే సంగతులు, అందుకే ఒక్కరి వద్దే ఉంచుతారు. ఇంతవరకు బాగానే ఉంది, మరి ఆ రహస్యం తెలిసిన ఒక్కడు హఠాత్తుగా మరణిస్తే.. ఇంకేముంది అంతే.. గోవిందా.. అనుకోవడమే. నెట్ లో హాల్ చల్ చేస్తున్న క్రిప్టో కరెన్సీ గురించి ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. అదే ప్రస్తుతం అత్యంత ఖరీదైన ధనం గా నెట్ లో పరిగణించబడుతుంది. నేడు ప్రతిదీ ఆన్ లైన్ కాబట్టి, ఇటువంటి కరెన్సీ కి భవిష్యత్తు లో తీవ్రంగా గిరాకీ ఉంటుందనే నేపథ్యంలో చాలా మంది ఈ తరహా నగదు పై పెట్టుబడి భారీగానే పెట్టారు.

వాటిని వివిధ నగదు రూపాలలో మార్చుకునేందుకు కూడా కొన్ని ఆన్ లైన్ సంస్థలు ముందుకు వచ్చాయి.. ఇలాంటివి ఒక వ్యక్తి గా కూడా చేస్తుండటం విశేషం. వీరు మీడియేటర్ గా ఉంటారు. కావాల్సిన వారు వీరికి సాధారణ నగదు ఇచ్చి, ఈ క్రిప్టో కరెన్సీ ని కొంటారు; అది అధికధర పలికినప్పుడు మళ్ళీ సాధారణ నగదులోకి మార్చుకుంటారు. లేదంటే అలాగే పెట్టుబడిని దీర్ఘకాలికంగా కొనసాగిస్తారు. ఇలాంటి పెట్టుబడులు దాదాపు వెయ్యి కోట్లు అయ్యాయి. మరి అంత పెట్టుబడి అంటే, దానికో రక్షణ ఉండాలి కదా. అది కూడా ఏర్పాటు చేశాడు అతగాడు. ఇంతవరకు చాలా బ్రహ్మాండంగానే ఉంది, కానీ, హఠాత్తుగా ఈ వ్యక్తి మృతి చెందాడు. లావాదేవీలన్నీ అతగాడి ద్వారానే జరగాల్సి ఉంది.. కోట్ల పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబో అంటున్నారు. ఈ మనీ ఇంక మరోవిధంగా మార్చేందుకు కూడా దారిలేదు అంటున్నారు నిపుణులు. అతీగతీ లేని పెట్టుబడులు, చివరికి ఇలాంటి చేదునే మిగులుస్తాయి.

అసలు ఈ తరహా కరెన్సీ కి ప్రపంచంలో ఏ దేశం అనుమతిగాని, గుర్తింపు కానీ లేదు. అయినా కూడా నెట్ లో దీనికి గిరాకీ మాత్రం బోలెడంత. ఇంతకీ అతగాడి పేరు తెలియాలి కదా.. క్రిప్టో కరెన్సీ సీఈఓ గెరాల్డ్ విలియం కొటెన్. ఇతడి మరణం ఇప్పుడు చాలా మందికి శోకం మిగిల్చింది. ఈ వెయ్యి కోట్లలో ఉన్నత వర్గాల వారి వాటా ఎక్కువగా ఉంటె, వారు ఎలాగోలా భరిస్తారు; కానీ, సామాన్యులది ఉంటె, ఆ బాధ తీరేది కాదు. 

Related posts