telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ రెండు దేశాల్లో భారీగా నమోదవుతున్న కరోనా మరణాలు…

corona mask

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఒకవైపు ప్రపంచంలో ఈ పాత కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే ఇటీవలే బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయపెడుతున్నది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 8.43 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  రోజువారీ కేసుల సంఖ్యకూడా భారీగా నమోదవుతున్నాయి.  నిన్న ఒక్కరోజు దాదాపుగా 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  నిన్నటి రోజున అమెరికాలో ఒక్కరోజులో 1,63,252 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 2085 మంది కరోనాతో మృతి చెందారు. కొత్త స్ట్రెయిన్ బయటపడిన యూకేలో ఒకరోజులో 53,285 కరోనా కేసులు నమోదయ్యాయి.  613 మంది కరోనాతో మృతి చెందారు.  బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులతో పాటుగా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. చూడాలి మరి అక్కడ ఈ వైరస్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అనేది.

Related posts