telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా మహమ్మారితో నిర్మాతలు రోడ్డున పడుతున్నారు…

karona virus

ఎక్కడో చైనాలో ఉన్న జబ్బు మన ఇండియాకు రావడం.. అందులోనూ తెలంగాణకు రావడమేంటి అంటూ నవ్వుకున్నారు. కానీ వారం రోజుల్లోనే కరోనా చుక్కలు చూపిస్తుంది. దెబ్బకు అన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చునేలా చేసింది ఈ వైరస్. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా ఈ వైరస్ ప్రభంజనంలా విరుచుకుపడుతుంది. ఇప్పటికే ఇండియాలో కరోనా మరణాలు కూడా మొదలైపోవడంతో సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోతున్నాయి.సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు. ఇంటి నుంచి బయటికి వస్తుంటే మాస్క్ లేకుండా రాలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే రావద్దని చెబుతుంది. ఈ ప్రభావం టాలీవుడ్‌పై దారుణంగా పడుతుంది. ఇప్పటికే కోట్ల రూపాయలు నష్టపోతున్నారు నిర్మాతలు. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారితో చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. పెద్ద నిర్మాతలకు కూడా వడ్డీల రూపంలో కోట్ల నష్టం వస్తుంది. ఈ వైరస్ కారణంగా రెగ్యులర్‌గా ఏదో పక్కూరికి వెళ్లొచ్చినట్లు బ్యాంకాక్, థాయ్ ల్యాండ్ లాంటి దేశాలు తిరిగేసి వచ్చే మన స్టార్స్ కూడా అంతా ఇంట్లోనే ఉన్నారు.

Related posts