telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం… మహిళల కోసం స్పెషల్‌ బడ్జెట్‌

cm jagan

మహిళ దినోత్సవం సందర్భంగా మరో శుభవార్త చెప్పింది జగన్‌ ప్రభుత్వం. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి జెండర్ బేస్డ్ బడ్జెట్టుకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మహిళ, శిశు సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులతో ప్రత్యేక బడ్జెట్టును ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ ప్రభుత్వం. మహిళా, శిశు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక జెండర్ బడ్జెట్ తయారు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం… సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఈ వర్గాలకు అందిస్తున్న వివిధ సంక్షేమ నిధులను ప్రత్యేకిస్తూ బడ్జెట్ రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకుంది. మహిళలు, బాలికలతో పాటు 18 ఏళ్లలోపు వయసున్న మైనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల్ని ప్రత్యేక బడ్జెట్ ద్వారా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మహిళా-శిశు, దివ్యాంగ వృద్ధుల బడ్జెట్ అమలుకు మహిళా శిశు సంక్షేమశాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కోంది ఆర్ధికశాఖ.

Related posts