telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏ తప్పు చేయని వాళ్లను బదిలీ చేశారు: చంద్రబాబు

chandrababu at kondapalli utsav
కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.ఏ తప్పు చేయని అధికారులను  బదిలీ చేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ వైసీపీ నేతల జేబు సంస్థగా మారిందని  చంద్రబాబు దుయ్యబట్టారు.  ఎస్పీ బదిలీ అవుతాడని ఉదయం అభ్యర్థి చెబుతాడు… సాయంత్రానికి ఎస్పీని బదిలీ అవుతాడని  చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌ తమతో ఉంటారని ప్రధాని మోదీ అన్నాడని గుర్తుచేశారు. టీడీపీని ఇబ్బంది పెట్టాలని అందరూ ఏకమయ్యారన్నారు. సీఈసీ వచ్చి వైసీపీకి ప్రచారం చేస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు.
దేశాన్ని నాశనం చేయాలని మోదీ చూస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు ఐటీ దాడులు ఎలా చేస్తారని బాబు ప్రశ్నించారు. జగన్‌ హైదరాబాద్‌లో కూర్చొని ఏపీపై మానిటరింగ్‌ చేస్తున్నాడని ఆరోపించారు.విచారణ చేయకుండా ఎలా చర్యలు తీసుకుంటారు?. మోదీ, సీఈవో కలిసి దేశంపై పెత్తనం చేయండన్నారు. అన్ని నిర్ణయాలు ఢిల్లీలో తీసుకుంటే సీఈవోలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని బాబు వ్యాఖ్యానించారు. 

Related posts