telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఉగ్రవాది మసూద్ కు .. పాక్ భారీ భద్రత.. ! ఇంక మారదు.. చర్యలే సరి..!!

masud alive announced by his own

పాక్ దేశం అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌కు 10 మంది స్పెషల్ సర్వీసు గ్రూప్ కమెండోలతో అదనపు భద్రత కల్పించిందని భారత నిఘావర్గాలకు రహస్య సమాచారం అందింది. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతిగా ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన అనంతరం మసూద్ భద్రత కోసం పదిమంది కమెండోలను పాక్ సర్కారు నియమించిందని నిఘావర్గాల నివేదికలో వెల్లడైంది. బాలాకోట్ దాడులకు ముందు భావల్‌పూర్‌గోత్ గన్నీలోని రావల్పిండి సైనిక ఆసుపత్రిలో ఉన్న మసూద్ ను ఇస్లామాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షేఖుపురా, గుజ్రవాలా ప్రాంతాలకు రహస్యంగా తరలించారు.

ఐక్యరాజ్యసమితి మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన నేపథ్యంలో అతన్ని భద్రత కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తూ అదనపు భద్రత కల్పిస్తున్నారని సమాచారం. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నాలుగురోజుల ముందే మసూద్ పాక్ ఆర్మీతో కలిసి జురా పట్టణంతోపాటు నీలం లోయంలో పర్యటించారని సమాచారం అందింది. అత్ముగమ్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరంలో మసూద్ ఉన్నాడని భారత ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. పుల్వామా దాడి అనంతరం భారత బలగాలు 25 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులను ఎన్ కౌంటర్లలో మట్టుబెట్టిన నేపథ్యంలో మసూద్ అజర్ కు పాక్ సైన్యమే అదనపు కమెండోలతో భద్రత కల్పించారని నిఘావర్గాలకు సమాచారం అందింది.

Related posts