telugu navyamedia
సినిమా వార్తలు

పాయల్ “బుల్‌ రెడ్డి…” పెప్పీ మాస్‌ వీడియో సాంగ్‌

payal special song in sita movie

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం “సీత”. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్‌ గోమటం, అభిమన్యుసింగ్‌ నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. అయితే “సీత” సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెంగర్ల్‌గా అవతారమెత్తింది. “బుల్‌ రెడ్డి…” అనే పెప్పీ మాస్‌ సాంగ్‌లో పాయ‌ల్ మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. ఇందులో పాయల్ అభినయం, నృత్యాలు, గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఆ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. సీత క్షేమం కోసం రాముడి లాంటి యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది చిత్రంలో చూపించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. “ఆర్‌ఎక్స్100” చిత్రంతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న పాయల్ రాజ్ పుత్ ప్ర‌స్తుతం “వెంకీమామ” చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించ‌నుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్టులు చేస్తుంది పాయ‌ల్‌.

Related posts