telugu navyamedia
culture news political

ఉద్యోగులకు బాసులు ఘన సత్కారం.. బూట్లు విప్పి కాళ్లు కడిగిన వైనం!

Bosses washes employees

విధి నిర్వహణలో ఉద్యోగులు ఎంత కష్టపడుతున్న బాసులను మెప్పించడం అంత సులభమైన పనికాదు. దీంతో చాలామంది తమ బాస్లు తమను తిట్టకుండా ఉంటే చాలని ఉద్యోగులు భావిస్తుంటారు.అయితే చైనాలోని ఆ సంస్థలో మాత్రం కష్టపడి పనిచేసే ఉద్యోగులను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. ఆ సంస్థలో తమ కింది ఉద్యోగులకు బాసులు ఘన సత్కారం చేశారు. వారి శ్రమను గుర్తించి షూలు విప్పి కాళ్లు కడిగారు. సంస్థ అభివృద్ధికి చేస్తున్నా సాయానికి గాను ఉద్యోగులందరికీ చేతులు జోడించి నమస్కరించారు. ఈ కార్యక్రమం చైనాలోని జినాన్ ప్రాంతంలోని ఓ సంస్థలో నవంబరు 2న నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆ సంస్థకు చెందిన ఇద్దరు సినీయర్ మహిళా అధికారులు.. బాగా పనిచేసిన తమ కింది ఉద్యోగులను వేదిక కూర్చొబెట్టారు. అనంతరం వారి కాళ్లు కడిగారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. తమ కింద ఉద్యోగుల ముందు మోకరిల్లి.. వాళ్ల కాళ్లు కడగడం కంటే ఆ ఉద్యోగుల జీతాలను పెంచినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి బాసులు మాకెందుకు లేరని వాపోతున్నారు.

Related posts

దుబాయిలో సెన్సేషనల్‌గా మారిన 8 ఏళ్ల బాలుడు…!!?

vimala p

ఈవీఎంలపై జీవీఎల్‌ పుస్తకం రాశారు.. ఇప్పుడు మాట మార్చారు!

vimala p

తమకు ఓటు వేస్తే  మద్యంపై 50 శాతం డిస్కౌంట్..

ashok