telugu navyamedia
telugu cinema news

పుల్వామా అమ‌ర జ‌వాన్ల‌ కోసం స్టార్ హీరోలు…  

ఫిబ్ర‌వ‌రి 14, 2019న‌ దేశం మొత్తం ఒక్క‌సారిగా వ‌ణికింది. ఎవ‌రి నోట విన్నా ఒక్క‌టే చర్చ‌. ఎవ‌రి నోట విన్నా పుల్వామా ఘ‌ట‌న గురించే. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 49 మంది జవాన్లు అమరులయ్యారు. గత మూడేళ్లలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఈ ఘ‌ట‌న‌ని ప్రపంచ అగ్రదేశాలు ఖండించాయి. పలువురు ప్ర‌ముఖులు అమ‌రులైన కుటుంబాల‌కు త‌మ‌కి తోచినంత విరాళాన్ని అందించారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చ‌న్‌, అమీర్ ఖాన్, ర‌ణ‌బీర్ క‌పూర్ సైనికుల స్మారక జ్ఞాపకార్థం సీఆర్‌పీఎఫ్‌తో కలిసి వారికి శ్రద్ధాంజలిగా వీడియో పాట రూపొందిస్తున్నారు. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు న‌టిస్తున్న విష‌యాన్ని సీఆర్‌పీఎఫ్ త‌న అఫీషియ‌ల్ వెబ్‌సైట్ ద్వారా తెలిపింది. తు దేశ్ మేరా అంటే సాగే ఈ పాట‌లో ముగ్గురు స్టార్స్ తెలుపు దుస్తుల‌లో క‌నిపించ‌నున్నారు. స‌ల్మాన్ ఖాన్, షారూఖ్‌ఖాన్, అక్ష‌య్ కుమార్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ర‌ణ్‌వీర్ సింగ్‌, వ‌రుణ్ ధావ‌న్ కూడా ఈ సాంగ్‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం.

Related posts

రెండు భారీ చిత్రాలపై … బెట్టింగులు కూడా రికార్డు స్థాయిలోనే …

vimala p

“మార్కెట్లో ప్రజాస్వామ్యం” వస్తోంది

ashok

జర్నలిజం లో నిష్టాతులను సత్కరించిన శృతిలయ..

vimala p