telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4″ ఎంట్రీపై స్పందించిన నందు

Nandu

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి దాదాపు ముహూర్తం ఖాయం అయినట్టే. ఇప్పటికే సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాగా… 106 రోజుల పాటు బిగ్ బాస్ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. అయితే బిగ్ బాస్ షో సీజన్-4 పోటీదారుల జాబితా గురించి చాలా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నందు పేరు కూడా గత కొన్నిరోజులుగా వినిపిస్తోంది. కాగా ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ నందు తన ఇన్స్టాగ్రామ్ లో “డార్లింగ్స్ నేను బిబిలో వస్తున్నా. బిబిలో మన రచ్చ మామూలుగా వుండదు. మీకు మరింత వినోదాన్ని పంచుతాను. మీ మద్దతు నాకు కావాలి” అని పోస్ట్ చేసారు. అంతే కాకుండా ప్రేక్షకులను ఆకర్షించడం కోసం మరికొన్నిఆసక్తికర విషయాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

Related posts