telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రారంభమైన “బిగ్ బాస్-3″… కంటెస్టెంట్లు వీరే…

Bigg-Boss-3

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్ ఆదివారం రాత్రి సరిగ్గా 9:00 గంటలకు ప్రారంభమైంది. ఈ షో ఎన్నో వివాదాలు.. మరెన్నో పిటిషన్లు.. ఇంకెన్నో వార్నింగ్‌లు, నిరసనల మధ్య ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ షోను ఆపాలని ఆఖరికి ఓయూ విద్యార్థుల సైతం అక్కినేని నాగార్జున ఇంటి ముందు ధర్నా చేసిన విషయం విదితమే. మొదట బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున షో గురించి చెప్పుకొచ్చారు. అనంతరం కంటెస్టెంట్లను పరిచయం చేశారు. ఒక్కో కంటెస్టెంట్‌కు రెండు మూడు నిమిషాల పాటు సమయం కేటాయించి, వారిని బిగ్‌బాస్ ప్రియులకు పరిచయం చేశారు. ఇక నాగ్ విషయానికొస్తే… షో మొదటి రోజే ఆయన వాక్ చాతుర్యం, మధ్య మధ్యలో పంచ్ డైలాగ్స్, ఇంకా పండు (కోతి బొమ్మ), బిగ్‌బాస్ మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ షోలో 7 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఇద్దరు న్యూస్ యాంకర్స్, రియల్ కపుల్స్, ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్స్, ఒక కొరియోగ్రాఫర్, తెలంగాణకు చెందిన ఒక సింగర్, ఒక బుల్లితెర యాంకర్, ముగ్గురు నటీమణులు, ఒకరు సీనియర్ నటి కమ్ కమెడియన్, ఇంకొకరు సీరియల్ కమెడియన్, ఫన్‌బకెట్ ఫేమ్ ఉన్నారు. ఈ 15 మంది వరుసగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

ఆ 15 మంది కంటెస్టెంట్లు ఎవరంటే…
1. తీన్మార్ సావిత్రి
2. సీరియల్ యాక్టర్ రవికృష్ణ
3. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన అశురెడ్డి
4. న్యూస్ యాంకర్ జాఫర్ బాబు
5. నటి కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ హిమజ
6. తెలంగాణ పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
7. సీరియల్ కమెడియన్ కమ్ జబర్దస్త్ ఫేమ్ హిమజ
8. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
9. నటి పునర్నవి భూపాలం (తెలుగు అమ్మాయి)
10. సీనియర్ నటి కమ్ కమెడియన్ హేమ
11. సీరియల్ యాక్టర్ అలీ రెజా
12. ఫన్‌బకెట్ ఫేమ్ మహేశ్ విట్టా
13. బుల్లితెర యాంకర్ శ్రీముఖి
14. హీరో వరుణ్ సందేశ్
15. నటి వితిక షేరు

Related posts