telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను ముట్టుకుంటే మీటూ కేసు పెడతా… : నటుడిని బెదిరిస్తున్న నటి

Siddharth

ప్రముఖ హిందీ బుల్లి తెర నటుడు సిద్దార్థ్ శుక్లాపై బాలీవుడ్ మొత్తం ఆగ్రహంగా ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో సిద్ధార్థ్ పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో మరో మహిళా కంటెస్టెంట్‌ను ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అది కాస్త రచ్చగా మారింది. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు సాంప్ సీడీ అనే టాస్క్ ఇచ్చారు. దేవోలినా అనే కంటెస్టెంట్ తన టీంతో కలిసి నిచ్చెన పేర్చుతుంటే సిద్ధార్థ్ టాస్క్ పాడుచేయడానికి ప్రయత్నించాడు. దాంతో దేవోలినా సిద్ధార్థ్‌పై మండిపడింది. అంతేకాదు తనను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీటూ ఆరోపణలు చేసి కేసుపెడతానని బెదిరించింది. దేవోలినా మీటూ పేరుతో సిద్దార్థ్‌ను బెదిరించడం కూడా వివాదాస్పదమవుతోంది. అనవసరంగా ఈ ఉద్యామన్ని మిస్యూస్ చేసుకోవాలని చూస్తోంది. తెలుగులో ప్రసారమైన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్‌లో దేవోలినా గోపిక పాత్రతో బాగా పాపులర్ అయింది. ఈ సీరియల్ తెలుగులోనూ ఏడేళ్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. దాంతో ఈ విషయం కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. ఇక సిద్ధార్థ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన రోజే ఓ యువతితో గొడవపడ్డాడు. హౌస్‌లోని ఇతర ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా ఓ బుల్లి తెర నటి సిద్ధార్థ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ‘బాలికా వధు’ సీరియల్‌తో పాపులారిటీ తెచ్చుకున్న సిద్ధార్థ్.. ఇదే సీరియల్‌లో తనకు భార్యగా నటించిన షీతల్ ఖందేల్ అనే నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె మీడియా ముందు బయటపెట్టింది. దాంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సిద్ధార్థ్‌ను బిగ్ బాస్ నుంచి తొలగించాలని, అతన్ని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిచాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts