telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ విద్యా వార్తలు

అభినందన్ కథ .. ఇక రాజస్థాన్ విద్యార్థుల సిలబస్ లో .. !

abhinandan story in rajastan school syllabus

భారత యుద్ధవిమాన కమాండర్ అభినందన్ ఇప్పుడు అందరికి సుపరిచితుడే. ఆయన సాహసాలు అందరికి, ముఖ్యంగా రాబోవు తరాలకు స్ఫూర్తిగా ఉండాలని పాఠశాల స్థాయిలో అతడి సాహసాలను, దేశభక్తిని చాటిచెప్పే అంశాలను సిలబస్ లో చేరుస్తున్నారు. దీనితో అభినందన్‌ సాహస గాథను రాజస్థాన్‌ విద్యార్ధులు ఇకపై పాఠ్యాంశంగా చదువుకొనున్నారు. అభినందన్‌ గౌరవార్ధం పాఠ్యాంశంగా చేర్పించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం భావిస్తోంది. అభినందన్‌ స్టోరీని స్కూల్‌ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటూ రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ ప్రతిపాదించారు.

అభినందన్‌ జోధ్‌పూర్‌లోనే విద్యాభ్యాసం చేసినట్లు మంత్రి గోవింధ్‌ ఇవాళ ట్విట్టర్లో పేర్కొన్నారు. వైమానిక దాడుల సమయంలోనూ, ఆ తర్వాత అభినందన్‌ కనబర్చిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆయనను గౌరవించేందుకే రాజస్థాన్‌ స్కూల్‌ సిలబస్‌లో అభినందన్‌ జీవిత చరిత్రను పొందుపర్చనున్నట్లు వెల్లడించారు.

మంత్రి చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే రివ్యూ కమిటీ నుంచి ఆమోదం లభించింది. రాజస్థాన్ సర్కారు తీసుకున్న ఈ చొరవ మెచ్చుకోదగింది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభినందన్ కథను విద్యార్థులకు అందించినట్టైతే ఆయా విద్యార్థులలో స్ఫూర్తి నింపినవారు అవుతారు.

Related posts