telugu navyamedia
సినిమా వార్తలు

ఘనంగా “గోపి గోడమీద పిల్లి” హీరోయిన్ వివాహం

Aarthi

సోమవారం నాడు సినీ నటి ఆర్తి చాబ్రియా వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. విశరధ్‌ బీడసీ అనే చార్టెడ్ అకౌంటర్ ని ఆర్తి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ నటులు హాజరయ్యారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. మార్చి 11న ఆర్తి, విశరధ్‌ ల ఎంగేజ్మెంట్ జరిగింది. విశరధ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పని చేస్తున్నారు. త్వరలోనే ఆయన ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆర్తి 2003లో తెలుగులో “ఒకరికి ఒకరు” సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగులో “ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి”, “గోపి గోడమీద పిల్లి” వంటి చిత్రాల్లో నటించింది. వెంకటేష్ నటించిన “చింతకాయల రవి” సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చివరిగా 2013లో ఓ పంజాబీ సినిమాలో కన్పించింది. ఆ తరువాత ఆర్తి సినిమాలకు దూరమైంది. మళ్ళీ ఇప్పుడు పెళ్ళితో వార్తల్లో నిలిచింది.

Related posts